Minister | విరిగిపడ్డ జెండా కట్టె..

Minister | విరిగిపడ్డ జెండా కట్టె..
- మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘటన
Minister | మక్తల్ , ఆంధ్రప్రభ : భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ చేస్తున్న సందర్భంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జండా కట్టె విరిగిపడింది. ఈ సంఘటనలో రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి తృటితో పెను ప్రమాదం తప్పింది.

ఆ వెంటనే విరిగిపడ్డ జెండా కట్టెను అలాగే పైకి అందించగా కార్యాలయ సిబ్బంది విరిగి జెండా కట్టెకు జెండా ఉన్న మిగతా కట్టెను తాడుతో కట్టి వదిలేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నో సంవత్సరాలుగా ఆ దిమ్మె ఎండకు ఎండుతూ వానకు నానుతూ లోపలే పుచ్యుపట్టి ఇవాళ జెండా ఎగరేస్తున్న సమయంలో విరిగిపడింది. కనీసం జెండా కట్టను చూడకుండా అధికారులు రిపబ్లిక్ డే సందర్భంగా హడావుడిగి జెండా ఏర్పాట్లును చేశారు.
అధికారులు ఆ జెండా దిమ్మెను కర్ర పరిశీలించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై జాతీయ జెండాకు అవమానం జరిగిందని అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించాలని సోషల్ మీడియాలో ఆరోపణలు చర్చలు కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి త్రుటిలోపైన ప్రమాదం తప్పింది.
అయితే ఆయన పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కున్సి నాగేందర్ రాలి బొటనవేలు పై పడటంతో నరం చిట్లిపోయినట్లు గుర్తించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన కుటుంబ సభ్యులు పాలమూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
