Minister | ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Minister | ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
- మంత్రి ఏ లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేతల వినతి
Minister | కడెం, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పీఆర్సీ ని వెంటనే ప్రకటించాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి ఏ లక్ష్మణ్ కుమార్ కు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పరంగా రావాల్సిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని హెల్త్ కార్డులను హెల్త్ ట్రస్టు ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయుల రిటైర్మెంట్ అధికారికంగా మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించాలని, రిటైర్మెంట్ అయిన రోజునే వెంటనే వారికి పెన్షన్ పత్రాలు మంజూరు చేయాలన్నారు.
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్ కు అడ్డంకిగా ఉన్న అడాక్వసి అనే పదాన్ని తొలగించి ఓపెన్ కేటగిరిలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్ వచ్చే విధంగా చూడాలని కోరారు. అదేవిధంగా 342 జీవో ప్రకారం ప్రస్తుతం బీఈడీకి ఇస్తున్న అనుమతిని ఇతర పీజీ కోర్సులు చదివేందుకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చేలా 342 జీవోను సవరించాలని ఈ సందర్భంగా వారు రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ కు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లు, డైరీలను రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడ రాజనర్సు బాబు రాము నాయక్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
