Minister | అన్ని వర్గాల సంక్షేమం కోసం..

Minister | అన్ని వర్గాల సంక్షేమం కోసం..

Minister | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పెంచిన పింఛన్లను మొదటి నెల నుంచే అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, రైతు సంక్షేమానికి, కార్మిక వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ప్రతి నెలా పింఛన్ అందుతుందా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply