Minister | పడమటి ఆంజనేయ స్వామి సన్నిధిలో…

Minister | పడమటి ఆంజనేయ స్వామి సన్నిధిలో…
- మంత్రి వాకిటి శ్రీహరి
Minister | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి వారిని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Walkie-talkie Srihari) దర్శించుకున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ జరుగుతున్న రథోత్సవం సందర్భంగా మంత్రి ఇంటి ఇలవేల్పు అయినటువంటి శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారికి కుటుంబ సమేతంగా(As a family) తరలివచ్చి దర్శించుకున్నారు.

ముందుగా స్వామివారికి మంత్రి తలనీలాలు సమర్పించి నూతనంగా పునరుద్ధరించబడిన కోనేటిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వంశపార్యపర్య (Hereditary)ధర్మకర్త ప్రాణేశాచారి మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అదేవిధంగా తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
