AP | ఇచ్ఛాపురంలో మినీ మహానాడు.. భారీగా హాజ‌రైన టీడీపీ శ్రేణులు

ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురంలో నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు నిర్వ‌హించారు. స్థానిక క్రిష్ణ తేజ కన్వెన్షన్ లో ప్రారంభమైన మినీ మ‌హానాడుకు టీడీపీ శ్రేణులు భారీగా హాజ‌ర‌య్యారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రత్యేక పరిశీలకునిగా మొదలవలస రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాగునీరు, త్రాగునీరు, వ్యవసాయ సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. ఇసుక దోపిడీపైనా చర్చించారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీతో పాటు ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *