Milk Union | పాడి రైతు కుటుంబానికి ఆర్థిక సాయం..

Milk Union | పాడి రైతు కుటుంబానికి ఆర్థిక సాయం..

పాల రైతులకు భరోసా కల్పించడమే కృష్ణ మిల్క్ యూనియన్ ( విజయ డైరీ) లక్ష్యం..

వైసిపి నేత కొమ్మినేని రవిశంకర్..

Milk Union | నందిగామ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా మాగల్లు గ్రామంలో ఇటీవల మరణించిన పాల రైతు శంకరశెట్టి కృష్ణారావు కు కృష్ణ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి కృష్ణ క్షీర బంధు పథకం ద్వారా ఆ కుటుంబానికి అండగా 50వేల రూపాయలు చెక్కు ను వైసీపీ నేత రవిశంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కొమ్మినేని రవిశంకర్ మాట్లాడుతూ కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రవేశపెట్టిన కృష్ణ క్షీర బంధు పథకం కింద సంఘ పాల ఉత్పత్తిదారుడైన శంకర్ శెట్టి కృష్ణారావు మరణించడంతో ఆ కుటుంబానికి ఆపదలో ఆపన్న హస్తం లా నిలిచిందన్నారు.

Milk Union | మేమున్నామని భరోసా

పాల రైతు కుటుంబాలకు తోడుగా మేమున్నామని భరోసా కల్పించడమే కృష్ణ క్షీర బంధు కృష్ణ మిల్క్ యూనియన్ ( విజయ డైరీ) లక్ష్యమని రవిశంకర్ అన్నారు. అనంతరం కృష్ణ మిల్క్ యూనియన్ మేనేజర్ మాట్లాడుతూ కృష్ణ మిల్క్ యూనియన్ వారి విజయ డైరీ కి పాలు పోసే రైతు ఏ కారణం చేతనైనా మరణించిన శోకసముద్రంలో ఉన్న ఆ కుటుంబానికి యూనియన్ వారు 50,000 పరిహారం చెల్లించిందని అయితే ఆ రైతు మరణించిన తేదీ ముందు 365 రోజుల్లో కనీసం 180 రోజులు, 108 లీటర్లు పాలు పోసి ఉండాలని దీనికోసం రైతు నుండి ఏ విధమైన ప్రీమియం చార్జీలు వసూలు చేయరని తెలిపారు.

Milk Union |

2019 జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వలన యూనియన్కు పాల రైతులుకు మధ్యాహ్నం ఉన్న బంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. మాగల్లు గ్రామంలో పాల రైతు శంకర్ శెట్టి కృష్ణారావు కుటుంబానికి అండగా ఉన్నా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులుకు, మేనేజర్ సూపర్వైజర్కు పాల ఉత్పత్తిదారుల సంఘం , రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply