Midday Meals | 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి…

Midday Meals | 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి…
- జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్
Midday Meals | దండేపల్లి, ఆంధ్రప్రభ : పీడీఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 5. 6. 7 తేదీలలో వరంగల్ లో జరిగే పీడీఎస్ యు 23వ తెలంగాణ రాష్ట్ర మహాసభల(State Congresses)ను విజయవంతం చేయాలని దండేపల్లి మండల కేంద్రంలోని ఎస్సి వసతి గృహంలో ఈ రోజు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పోస్టర్లు(posters) విడుదల చేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ మాట్లాడుతూ… ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యు ఏర్పడి 50 సంవత్సరాలు పురస్కరించుకొని విప్లవ విద్యార్థుల అమరవీరుల ఆశలను ముందుకు తీసుకుపోవడం కోసం శాస్త్ర విద్య సాధనకై, విద్యార్థుల హక్కులకై, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ అనేక ఉద్యమాలు చేస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం(Lunch) పెట్టాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 5. 6. 7 తేదీలలో వరంగల్ లో జరిగే 23వ తెలంగాణ రాష్ట్ర మహాసభలలో విద్యారంగంపై చర్చించి భవిష్యత్తు(future) కార్యచరణ రూపొందించుకుని ఉద్యమాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.
ఈ మహాసభలకి విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు నాయకులు సాయి, శ్రావణ్, విలాస్, అశ్విత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
