ఇక చిన్న‌న‌గ‌రాల్లో మైక్రో బ్రూవరీ..

గోదావరిఖని, ఆంధ్ర‌ప్ర‌భ : బీర్లు కొనుగోలు చేయాలంటే ఇక నుంచి వైన్స్ షాపు(Wines shop)ల వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. బీరు ప్రియులకు ఎక్సైజ్ శాఖ శుభవార్తను ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానికే పరిమితమైన మైక్రో బ్రూవరీలు(microbreweries) త్వరలో న‌గ‌ర్‌లో కూడా ఏర్పాటు కానున్నాయి. బీర్లు తయారీకి ఎక్సైజ్ శాఖ(excise department) ఆహ్వానం పలుకుతుంది.


25 తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
మైక్రో బ్రూవరీలు ఏర్పాటుకు ఆస్తకి గల వారు సెప్టెంబరు 25 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా(Peddapalli District) ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి తెలిపారు. రామగుండం కార్పొరేషన్ ఏరియాలోని ఆసక్తి ఉన్నఔత్సాహికులు దరఖాస్తుతో పాటు రూ.

లక్ష చలానా, ఆధార్, హోటల్/రెస్టారెంట్/బార్/క్లబ్ లైసెన్స్(Hotel/Restaurant/Bar/Club License) జిరాక్స్ ప్రతులు జత చేసి ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అయితే ఇవి లేని వారు స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలుస్తోంది.


180 రోజుల వ్య‌వ‌ధిలో…
బీర్లు తయారీకి సంబంధించి అనుమతి పొందిన వారు 180 రోజుల వ్యవధిలో మైక్రొ బ్రూవరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఒక నిబంధన. చదరపు అడుగుల విస్తీర్ణం(Area) ఉండి, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసిన చోటే విక్రయించాల్సి ఉంటుంది.

ఇతర ప్రాంతాల్లో… బయట అమ్మేందుకు వీల్లేదు. కాల వ్యవధి 36 గంటల్లోపు అవి అమ్ముడు కాకుంటే పడవేయాల్సిందేనన్న నిబంధన పెట్టారు. బీర్ల తయారీకి అన్నిరకాల ముడి వస్తువులు అందుబాటులో ఉంటాయి. అప్పటికప్పుడు ఎంతంటే అంత క్షణాల్లో తయారీకి అవకాశం ఉంటుంది. అయితే అనుమతుల జారీ(Issue)లో ఎలాంటి జాప్యం ఉండదని తెలుస్తోంది.

Leave a Reply