వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సత్తా చాటారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్లకు చుక్కలు చూసిస్తూ.. వరుస వికెట్లు పడగొట్టారు. గుజరాత్ బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు. దాదాపు బ్యాటర్లు అందరు సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ కు క్యూ కట్టారు.
కేవలం విల్ జాక్స్ – సూర్య కుమార్ యాదవ్ లు రాణించడంతో… ముంబై స్కోర్ బోర్డుపై గౌరవప్రదమైన పరుగుల నమోదయ్యాయి. ఇక ఆఖర్లో కార్బిన్ బాష్ (27) రెండంకెల స్కోర్ సాధించాడు. దాంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది.
కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి తొలి ఓవర్లోనే మహ్మాద్ సిరాజ్ షాకిచ్చాడు. రెండో బంతికే ర్యాన్ రికెల్టన్ (2)ను ఔట్ చేశారు సిరాజ్. ఇక 4వ ఓవర్లో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (7) సైతం వికెట్ పారేసుకున్నాడు.
రోహిత్ శర్మ ఔటన తరువాత 3వ వికెట్ కు విల్ జాక్స్ (35 బంతుల్లో 53) – సూర్య కుమార్ యావద్ (24 బంతుల్లో 35) పార్ట్‌నర్‌షిప్ ఏర్పాటు చేశారు. 11 ఓవర్ల వరకు వీరిద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వరుసు బౌండరీలతో 3వ వికెట్ కు 43 బంతుల్లో 71 పరుగులు జోడించారు.
అయితే, కాస్త మిస్ ఫీల్డింగ్ తరువాత కోలుకున్న గుజరాత్…. ముంబైని తిరిగి కష్టాల్లోకి నెట్టింది. 10.4 ఓవర్లలో సాయి కిషోర్ బౌలింగ్ లో సూర్యకుమార్‌ను అవుట్ అయ్యాడు. దాంతో 26 పరుగులకు 2వ వికెట్ తర్వాత.. ముంబై జట్టు 97 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ ఔటన తర్వాత ఇన్నింగ్స్ ఒక్కసారిగా తారుమారైంది.
హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విల్ జాక్స్ ను 11.4 ఓవర్లలో రషీద్ ఖాన్ అవుట్ చేయగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1)ను 12.3 ఓవర్లలో సాయి కిషోర్ డగౌట్ కు పంపించాడు. ఆ వెంటనే 13.5 ఓవర్లో జెరాల్డ్ కోట్జీ బౌలింగ్ లో తిలక్ వర్మ (7) ఔటయ్యాడు. ఇక 16.2వ ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో నమన్ ధీర్ (7) వెనుదిరిగాడు.
దీంతో 97/3 గా ఉన్న స్కోరు.. 123/7గా మారింది. ముంబై కేవలం 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కార్బిన్ బాష్ (27) పరుగులతో పరువాలేదనిపించాడు. ఇక దీపక్ చాహర్ (8), కర్ణ్ శర్మ (1) నాటౌట్ గా నిలిచారు.
గుజరాత్ బౌలర్లలో రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ (2/34) రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్ (1/29), అర్షద్ ఖాన్ (1/18), ప్రసిద్ కృష్ణ (1/37), రషీద్ ఖాన్ (1/21), జెరాల్డ్ కోట్జీ (1/10) వికెట్లు సాధించారు. దీంతో 156 పరుగుల ఈజీ టార్గెట్ తో గుజరాత్ టైటాన్స్ ఛేజింగ్ కు దిగనుంది.