వాంఖడే వేదికగా గుజరాత్ – ముంబై జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఓవైపు బౌలర్లు చెలరేగుతుండగా.. మరోవైపు బ్యాటర్లు విజృంభిస్తున్నారు. వాంఖడే వేదికగా సమవుజ్జీల మధ్య జరుగుతున్న పోరులో.. టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేస్తుంది.
అయితే, ఓవైపు గుజరాత్ బౌలర్లు చెలరేగుతూ.. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (2), రోహిత్ శర్మ (7)లు స్వల్ప పరుగులకే పెవిలియన చేరారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్ (45 ; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు), సూర్య కుమార్ యాదవ్ (34 ; 22 బంతుల్లో 5 ఫోర్లు) విరుచుకుపడుతున్నారు. గుజరాత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ ముంబై స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో 10 ఓవర్లకు ముంబై స్కోర్ 2 వికెట్ల నష్టానికి 89గా ఉంది.