Mexico Tariff| మెక్సికో టారీఫ్ దాడి!

Mexico Tariff| మెక్సికో టారీఫ్ దాడి!

  • అమెరికా బాట‌లో మెక్సికో
  • వాణిజ్య ఒప్పందం లేని దేశాల‌పై 50 శాతం సుంకాల పెంపు

Mexico Tariff| వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికా బాట‌లోనే మెక్సికో (Mexico) ప‌య‌నిస్తోంది. ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎంపిక చేసిన వస్తువులపై సుంకాలను భారీగా పెంచేందుకు మెక్సికో ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేర‌కు ప్రతిపాదనలకు అక్కడి సెనెట్ ఆమోదం తెలిపింది. చైనా, భారత్ సహా పలు ఆసియా దేశాలకు చెందిన దాదాపు 1400 వస్తువులపై సుంకాలు 50 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఈ పెంపు వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల‌తో..
మెక్సికోతో చైనా, భారత్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేసియాల‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేదు. ఇతర ఆసియా (Asia) దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్స్, విడిభాగాలు, టెక్స్టైల్స్, దుస్తులు, ప్లాస్టిక్, స్త్రీలు తదితర వస్తువులపై సుంకాలు పెంచాలని మెక్సికో ప్రతిపాదించింది. వీటిని అక్కడి ఆర్థికమంత్రి సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టారు. అక్క‌డి చట్టసభలో అధికార మోరెనా పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ అప్పుడు సభ మద్దతు పొందలేకపోయింది. తాజాగా ఇందుకు గ్రీన్ సిగ్నల్ లభించడంపై అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ స్పందించారు. దేశీయ ఉత్పత్తి పెంచడం, చైనాతో వాణిజ్య సమతుల్యత సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు క్లాడియా తెలిపారు.

అమెరికా మెప్పు కోసమే…
అమెరికా-మెక్సికో-కెనడా (Mexico-Canada) వాణిజ్య ఒప్పందం తదుపరి సమీక్షకు ముందే ఈ చర్యలు తీసుకోవడం ఆసక్తిగా మారింది. అమెరికా మెప్పు కోసం మెక్సికో ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply