META | వాట్సప్‌లో మరింత ప్రైవసీ..

వాట్సప్‌లో మనం ఎవరికైనా ఫోటోలు, వీడియోలు పంపితే వారు వాటిని గ్యాలరీలో సేవ్‌ చేసుకోవచ్చు. అలా అవతలి వారు సేవ్‌ చేసుకోకుండా చేసే సదుపాయాన్ని వాట్సప్‌ అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు మరికొన్ని ప్రైవసీ సంబంధిత ఫీచర్లను వాట్సప్‌ తీసుకురానుంది.

వాట్సప్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌లో మనం ఎవరికైనా ఫోటోలు, మీడియోలు పంపినప్పుడు వారు గ్యాలరీలో సేవ్‌ చేసుకోకుండా యూజర్లకు ఓ ఆప్షన్‌ వాట్సప్ ఇవ్వనుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఉండనున్న ఈ ఆప్షన్‌ ఆన్‌ చేసుకున్నపుడు, అవతల వ్యక్తులు ఇమేజ్‌ను లేదా వీడియో సేవ్‌ చేయాలనుకున్నప్పుడు సేవ్‌ చేయడం కుదరదు. దీన్ని ఆఫ్‌ చేస్తే అవతలివారు సేవ్‌ చేసుకోవచ్చు. వన్‌టైమ్‌ సెండ్‌ ఆప్షన్‌ ద్వారా కూడా ఇలా చేవచ్చు. దీనికి సంబంధిత వీడియోను పంపించవచ్చు.

Leave a Reply