ఆంధ్రప్రభ : భారతీయ ఆరోగ్య సంరక్షణ అండ్ ప్రపంచ మెడ్‌టెక్‌కు ఒక మైలురాయి అయిన సందర్భంలో భారతదేశంలోని ప్రముఖ వైద్య పరికరాల కంపెనీల్లో ఒకటైన మెరిల్, నెక్ట్-జనరేషన్ సాఫ్ట్ టిష్యూ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ అయిన మిజ్జో ఎండో 4000ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ పురోగతి ఆవిష్కరణ సరైన శస్త్రచికిత్స అందుబాటును పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉన్నది. అలాగే భారతదేశపు ఈ అధునాతన రోబోటిక్ శస్త్రచికిత్స ప్రపంచానికి కేంద్రంగా మారే అవకాశములను సూచిస్తున్నది. మిజ్జో ఎండో 4000 అనేది జనరల్, గైనకాలజీ, యూరాలజీ, థొరాసిక్, కొలొరెక్టల్, బారియాట్రిక్, హెపాటోబిలియరీ, ఈఎన్టీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ అండ్ ఆంకాలజీ స్పెషాలిటీల్లో అసాధారణమైన విస్తృతమైన విధానాలకు సహాయపడటానికి రూపొందించబడిన బహుముఖ, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మంచి ప్లాట్‌ఫామ్.


ఈసంద‌ర్భంగా మెరిల్ సీఈఓ వివేక్ షా మాట్లాడుతూ… మిజ్జో ఎండో 4000 కేవలం ఒక సాంకేతిక పురోగతి కాదు – ఇది ఉద్దేశ్యపూర్తితమైన ప్రకటన అన్నారు. ఈ పద్దతి రోగులకు వేగవంతంగా కోలుకునే పరిస్థితులను కలిగించి మంచి ఫలితాలతో సురక్షితమైన, కనిష్ట ఇన్వాసివ్ విధానాలను అందించడానికి రూపొందించబడిందన్నారు. రాబోయే కాలంలో, ఈ ఆవిష్కరణ దేశవ్యాప్తంగా శస్త్రచికిత్స సంరక్షణను ఎంతో గొప్పగా మారుస్తుందని భారతదేశాన్ని మెడ్‌టెక్‌కు ప్రపంచానికి ఒక కేంద్రం బిందువుగా చేయగలదని తాము నమ్ముతున్నామన్నారు. భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు అధునాతన రోబోటిక్ సర్జరీని మరింత అందుబాటులోకి తెచ్చి, స్కేలబుల్ చేసి పరివర్తన చెందే విధంగా చేయడమే తమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

Leave a Reply