Mepma Dwakra | దోషులను శిక్షించాలి

Mepma Dwakra | దోషులను శిక్షించాలి

  • మెప్మా కుంభకోణాన్ని నిష్పక్షపాతంగా విచారణ జరపాలి
  • ఎంఐఎం డిమాండ్

Mepma Dwakra | నరసరావుపేట, ఆంధ్రప్రభ : గత కొన్ని రోజుల క్రితం నరసరావుపేట పట్టణంలో మెప్మా డ్వాక్రాలో జరిగిన అవినీతి కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంఐఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు కలెక్టర్ కృతిక శుక్లాను కలిసిన ఎంఐఎం జిల్లా అధ్యక్షులు కరిముల్లా పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి తదితరులు ఆమెకు విజ్ఞప్తి చేశారు. అనంత‌రం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్.. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకోపోవడం, ముఖ్యమంత్రి స్పందించి విచారణ జరిపి అవినీతి చేసిన అధికారుల‌ ఆస్తులు జప్తు చేయమని ఆదేశించడం అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు.

కలెక్టర్ విచారణ కమిటీ వేయడం జరిగిందని, కాకపోతే విచారణ కమిటీ ఒక్క టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే విచారిస్తుందని, కాని వన్ టౌన్ పరిధిలో ఉన్న గ్రూపులను కూడా విచారించాలని, అలానే ముఖ్యంగా ఇపుడున్న అధికారులు ఆరోపణలు ఎదురుకుంటున్న వారి పై కూడా విచారణ జరపాలనిvకోరారు. అలానే బజార్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు అధికారులని సైతం విచారించే విధంగా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. పెండింగ్‌లో ఉన్న డబ్బులు కట్టలేని గ్రూపుల వద్ద మెప్మా అధికారులు తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురు పెట్టు బడి, కట్టని గ్రూపులకు 10 వేల రూపాయలు ఇచ్చి వారి వద్ద నోట్ చెక్ తీసుకొని విచారణ అధికారులకు తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలానే గతంలో పని చేసిన అధికారుల పై మాత్రమే విచారణ చేపట్టడం అనుమానాలకు తావిస్తుందని మౌలాలి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో పని చేసిన అధికారుల పై కూడా విచారణ జరిపి ఎవరైతే అవినీతి కీ పాల్పడ్డారో వారి పై చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా పీడీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామ‌ని మౌలాలి హెచ్చరించారు.

Leave a Reply