Men with Golden Hands | మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్!
– సమాజంపై ప్రభావం చూపుతున్న లింగ అసమానతలు
– మగవారి కోసం అల్లాడుతున్న మగువలు
– గంటల ప్రాతిపదికన పురుషుల సేవలు
– ఆన్‌లైన్‌లో బుకింగ్.. లాట్వియాలో గుడ్ బిజినెస్!
Men with Golden Hands | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అనేక దేశాల్లో లింగ అసమానతలు వేధిస్తున్నాయి. లింగ అసమానతలు సమాజంపై ఎంతో ప్రభావం చూపుతుంది. మగవారి సేవల కోసం మగువలు అల్లాడిపోతున్నారు. చివరకు పురుషుల సేవల కోసం మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్(Men with Golden Hands) అంటూ వ్యాపారాలు చేసి ఆదాయం బాగా పొందుతున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుని మహిళలు గంటల ప్రాతిపదికన మగవారు సేవలను పొందుతున్నారు.
Men with Golden Hands | అలాంటి దేశాల్లో లాట్వియా ఒకటి!

యూరోప్‌లోని లాట్వియా దేశంలో పురుషుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫలితంగా అనేక మంది మహిళలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. యూరోస్టాట్ గణాంకాల ప్రకారం.. లాట్వియాలో పురుషుల కంటే మహిళలు 15.5 శాతం ఎక్కువగా ఉన్నారు! యూరోపియన్(European) యూనియన్ (ఈయూ)లో సగటున ఉన్న లింగ అసమానత కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
ఇక లాట్వియా విషయానికి వస్తే 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో పురుషుల కంటే మహిళలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నారు. పని ప్రదేశాల్లో రోజువారీ జీవితంలో కూడా పురుషుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని లాట్వియన్(Latvian) మహిళలు చెబుతున్నారు. లింగ సమతుల్యత మెరుగ్గా ఉంటే సామాజిక పరస్పర చర్యలు మరింత ఆసక్తికరంగా ఉంటాయని అక్కడి మహిళలు అభిప్రాయపడ్డారు.
Men with Golden Hands | జీవిత భాగస్వాముల వేట..

లాట్వియాలో తగిన భాగస్వాములు దొరకనందున, చాలా మంది మహిళలు పార్ట్నర్స్(Partners) కోసం విదేశాలకు వెళుతున్నారని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కొంత మంది మహిళలు భర్తలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటున్నారని తెలిసింది. పురుష భాగస్వాములు లేకపోవడంతో, రోజువారీ ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి లాట్వియన్ మహిళలు ఇప్పుడు హ్యాండీమ్యాన్ సేవలను రెంట్‌కి తీసుకోవడంపై మొగ్గు చూపుతున్నారు.
Men with Golden Hands | గంటల ప్రాతిపదికన మగ వారి సేవలు!

“మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్” అనే సేవలను అక్కడ ఓ స్వచ్చంద సేవా సంస్థ అందిస్తుంది! వీరు ప్లంబింగ్, వడ్రంగి(Plumbing, Carpentry) పనులు, రిపేర్లు, టెలివిజన్ ఇన్‌స్టాలేషన్ వంటి పనుల్లో సహాయం చేస్తారు. ఈ సేవ ద్వారా మహిళలు ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ ద్వారా గంటల ప్రాతిపదికన పురుషుల సేవను బుక్ చేసుకోవచ్చు. కార్మికులు త్వరగా వచ్చి పెయింటింగ్, కర్టెన్లు సరిచేయడం, ఇతర నిర్వహణ పనులను చక్కబెడతారు.
Men with Golden Hands | ఇదీ ప్రధాన సమస్య…

లాట్వియాలో ఈ లింగ అసమతుల్యతకు ప్రధాన కారణం పురుషుల్లో ఆయుర్దాయం తక్కువగా ఉంటుందని నిపుణులు(Experts) చెబుతున్నారు. దీనికి ముఖ్యంగా అధిక ధూమపానం, దుర అలవాట్లు. జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలే కారణం. లాట్వియాలోని పురుషుల్లో 31% మంది ధూమపానం చేస్తుండగా, మహిళల్లో కేవలం 10% మాత్రమే ఉన్నారు. ఊబకాయం లేదా అధిక బరువు సమస్యలతో బాధపడే పురుషులు కూడా మహిళల కంటే ఎక్కువగా ఉన్నారు.


