Melania Fired : అయ్యో.. మెలానియా Andhra Prabha Top Story

Melania Fired : అయ్యో.. మెలానియా Andhra Prabha Top Story

  • ఎప్‌స్టైన్ ఫైల్స్ బాంబ్..!
  • ఇమెయిల్స్, ఫోటోల దుమారం
  • అవన్నీ అబద్ధాలే
  • ఇది రాజకీయ కుట్ర
  • మీడియా పై మెలానియా ఫైర్​
  • వెలుగులోకి ఎప్‌స్టైన్ నేర సామ్రాజ్యం
  • మైనర్ బాలికల ట్రాపికింగ్​
  • ప్రిన్స్ ఆండ్రూ సైతం అరెస్ట్​
  • ప్రపంచాన్ని కుదిపేస్తున్న స్కాండల్
  • ఫైల్స్ లో మరింత మంది పెద్దలు

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

Melania Fired

అగ్రరాజ్యం అమెరికా మాహిష్మతి ,,మోలానియా ట్రంప్​ .. అమెరికా ప్రథమ పౌరురాలు.. అనూహ్యంగా.. అకస్మాత్తుగా మీడియా వీధిలో ప్రత్యక్షం అయ్యారు. సోషల్​ మీడియాపై నిప్పులు చెరిగారు. ఐదేళ్ల కిందట జైలులోనే ఆత్మహత్య చేసుకున్న శృంగార మాంత్రికుడు .. ఆర్థిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టైన్ , అతడి తోడు దొంగ గిస్లైన్ మాక్స్‌వెల్‌తో.. తనకు ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని స్పష్టం చేశారు. సోషల్​ మీడియాలో వదంతులన్నీ అబద్ధపు ప్రచారం అని తేల్చి చెప్పారు. తన పరువు తీసిన ఈ కథనాలను తిప్పి కొట్టారు. అవన్నీ మార్పింగ్​ ఫోటోలని జనాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు.

Melania Fired : మేడమ్​ ఆక్రోశం

Melania Fired

నన్ను డొనాల్డ్ ట్రంప్‌కు జెఫ్రీ ఎప్‌స్టైన్ పరిచయం చేయలేదు. 1998లో ఒక పార్టీలో యాదృచ్ఛికంగా ట్రంప్​ నేను కలుసుకున్నాం నేను ఎప్‌స్టైన్ బాధితురాలిని కాదు . అతడి ప్రైవేట్ ద్వీపానికి వెళ్లలేదు. ఎప్పుడూ అతడి విమానం ఎక్కలేదు, నిజమే అతడి వల్ల మహిళలు నష్టపోయారు. బాధితులను విచారించండి. బహిరంగంగా సాక్ష్యం చెప్పే వీలు కల్పిం చండి అని అమెరికా కాంగ్రెస్​ను కోరారు. అగ్రరాజ్య మహారాణిగా … ఒక అతివగా.. .. తన పరువు ప్రతిష్టపై మెలానియా స్పందనలో.. ఆగ్రహం, అవేశం, ఆక్రోశం, ఆవేదన కలగలసిన భావోద్వేగం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెద్దాం.

Melania Fired : ఎప్‌స్టైన్ ఫైల్స్ దుమారం

Melania Fired

2025లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన ఎప్‌స్టైన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్’ తో… జనం నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో లక్షలాది డాక్యుమెంట్లు, వేలాది వీడియోలు ఫోటోలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇక్కడే.. అసలు కథ వెలుగులోకి వచ్చింది. సంపన్నుల శృంగార నైషథంలో.. వెలకత్తెల కథలు యావత్తు ప్రపంచాన్ని కదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​, ఆయన అర్థాంతి మెలానియా ట్రంప్​ సైతం నేరసామ్రాజ్య పడగ నీడలో సేదతీరినట్టు .. ఎప్‌స్టైన్ ఫైల్స్ లో పేజీలకు పేజీల కథలు వెలుగులోకి వస్తున్నాయి.ఇంతకీ మెలానియా ట్రంప్​ తిప్పికొట్టిన అభియెగాలు నిజంగా అబద్ధాలేనా? అవి అసత్యాలని నిరూపించే ఆధారాలు ఉన్నాయా? లేకపోతే.. బ్రిటీష్​ యువరాజు ఆండ్రూ మౌంట్​ బాటెన్​ తరహాలో.. కేసులో ఈ ట్రంప్​ జంట ఇరుక్కుంటుందా? కాదు నిర్దోషులుగా హానీమూన్​ కు వెళ్తారా? ఒక్క సారి వీరిద్దరూ ఈ ఆరోపణల్లో ఎలా చిక్కారు.. చూద్దాం.

Melania Fired : చిన్న క్లూ.. కుదుపే కుదుపు

Melania Fired

గిస్లైన్ మాక్స్‌వెల్‌కు మెలానియా పంపిన ఇమెయిల్స్ తో అసలు రాద్ధాంతం వెలుగులోకి వచ్చింది. 1990ల చివరలో మెలానియా (అప్పుడు ఆమె మోడల్‌గా ఉన్నారు) డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఒకటి లేదా రెండుసార్లు ఎప్‌స్టైన్ విమానంలో ప్రయాణించినట్లు ఈ రికార్డులు సూచిస్తున్నాయి. తాను కేవలం ప్రయాణికురాలిని మాత్రమేనని , ఎప్‌స్టైన్ వ్యక్తిగత నేరపూరిత వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఎప్‌స్టైన్ నిర్వహించిన కొన్ని హై-ప్రొఫైల్ పార్టీల ఫోటోలు ఈ ఫైల్స్‌లో బయటపడ్డాయి. 1990 నాటి సామాజిక కార్యక్రమాలలో మెలానియా, డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టైన్ కలిసిప ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పట్లో ఎప్‌స్టైన్ ఒక ప్రముఖ ఆర్థికవేత్త కావటంతో న్యూయార్క్ లోని ఉన్నత వర్గాల పార్టీలలో అందరూ కలిసేవారని, అంతకు మించి ఏమీ లేదని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. మెలానియా ‘మోడలింగ్’ కెరీర్ పై సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి:అమెరికాకు మోడలింగ్ వీసాపై వచ్చిన సమయంలో ఎప్‌స్టైన్ నెట్‌వర్క్ కు మెలానియా సహాయం చేసిందనేది కొందరి ఆరోపణ. ఇందుకు నిర్దిష్ట ఆధారాలు ఈ ఫైల్స్‌లో ఇంకా లభించలేదు.

Melania Fired : ఇది పొలిటికల్​ స్టంట్​

తన భర్త డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీయడానికే పాత విషయాలను తవ్వి తీస్తున్నారని మెలానియా ఆరోపించారు. “నా గత చరిత్ర పారదర్శకమైనది, ఇలాంటి తప్పుడు ఆరోపణలకు నేను భయపడను” అని ఆమె గట్టిగా చెప్పారు. ప్రస్తుతం మెలానియాపై ఎటువంటి నేరపూరిత ఆరోపణలు (Criminal charges) లేవు. ఆమె పేరు కేవలం ఎప్‌స్టైన్ సామాజిక వర్గంలో ఒక భాగంగా మాత్రమే ఫైల్స్‌లో కనిపిస్తోంది. ఇది సరే జనవరి 2026లో డొనాల్డ్ ట్రంప్ తన కేబినెట్ మంత్రి డగ్ బర్గమ్ భార్య కేథరిన్ అందంగా ఉన్నందునే ఆయనకు పదవి ఇచ్చానంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి.

Melania Fired : ఇంతకీ జెఫ్రీ ఎవరు?

Melania Fired

జెఫ్రీ ఎప్‌స్టైన్ (Jeffrey Epstein) అమెరికాలో అత్యంత వివాదాస్పద ఆర్థికవేత్త (Financier) . దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు. సామాన్య టీచర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, కోట్లాది రూపాయల ఆస్తిని గడించి, ప్రపంచంలోని అత్యంత శక్తివంత వ్యక్తులతో (రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు) సన్నిహిత సంబంధాలు కొనసాగించిన నేర సామ్రాట్​ గా పేరొండాడు.

సెక్స్ ట్రాఫి‘కింగ్’

Melania Fired

14 నుంచి 18 ఏళ్లలోపు వందలాది మంది మైనర్ బాలికలను ట్రాప్ చేసి, తన నివాసాలకు పిలిపించి లైంగిక దాడులకు పాల్పడే ఒక భారీ నెట్‌వర్క్‌ను నడిపాడు. ఫ్లోరిడాలో మైనర్ బాలికలను వ్యభిచారానికి పురికొల్పినందుకు 2008లో అతనికి 13 నెలల జైలు శిక్ష పడింది. ఆ సమయంలో కుదిరిన ఒక ‘రహస్య ఒప్పందం’తో భారీ శిక్షల నుంచి తప్పించుకున్నాడనే విమర్శలు ఉన్నాయి.యరో పదేళ్ల తరువాత 2019 జూలైలో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై ఫెడరల్ పోలీసులు అతడిని మళ్ళీ అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతుండగానే 2019 ఆగస్టు 10న న్యూయార్క్ జైలు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎప్‌స్టైన్ మరణానికి ఒకరోజు ముందే ‘మరణ ప్రకటన’ డ్రాఫ్ట్ తయారైనట్లు ఇటీవల విడుదలైన రికార్డులు సూచిస్తుండటంతో, అతని మరణంపై మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ డాక్యుమెంట్లు (Epstein Files) ఇంకా అనేక మంది శక్తివంతుల రహస్యాలను బయటపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు కొత్తగా బయటకు వస్తున్న ఫైళ్లలో బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, డొనాల్డ్ ట్రంప్ పేర్లు వినిపిస్తున్నాయి. ఫలితంగా పెద్ద రాజకీయం దుమారానికి దారితీస్తోంది.

Melania Fired : పాపం బ్రిటీష్​ యువరాజూ..

Melania Fired

ఎప్‌స్టైన్‌తో సంబంధాల నేపథ్యంలో బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ మౌంట్​బాటెన్​ ను 2026 ఫిబ్రవరిలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ఆండ్రూ దశాబ్దాల కాలం నాటి స్నేహం అందరికీ తెలిసిందే. అమెరికా విడుదల చేసిన ‘ఎప్‌స్టైన్ ఫైల్స్’ లో ఆండ్రూకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు బయటపడ్డాయి. బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా (UK Trade Envoy) ఉన్న సమయంలో, ఆండ్రూ తన అధికారిక పరిధిలోని అత్యంత రహస్య వాణిజ్య నివేదికలను ఎప్‌స్టైన్‌కు చేరవేశారని ఆరోపణలు వచ్చాయి.ఈ రహస్య సమాచారంతో ఎప్‌స్టైన్ అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా ప్రయోజనం పొదినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

Melania Fired : ఇటు బర్త్​ డే..అటు అరెస్ట్​

Melania Fired

2026 ఫిబ్రవరి 19, 2026న (ఆయన 66వ పుట్టినరోజున) ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. నార్ఫోక్‌లోని సాంద్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని తన నివాసం వద్ద థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆండ్రూను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ పదవిలో ఉండి దుష్ప్రవర్తనకు పాల్పడటం (Misconduct in Public Office) తీవ్ర నేరం కింద అతడిని అరెస్ట్ చేశారు. ఆండ్రూను లండన్‌లోని ఒక రహస్య పోలీస్ స్టేషన్‌కు తరలించి సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. రిలీజ్డ్ అండర్ ఇన్వెస్టిగేషన్” అనే నిబంధనపై విడుదల చేశారు. అంటే ఆయనపై విచారణ ఇంకా కొనసాగుతోంది, పోలీసులు అవసరమైనప్పుడు మళ్ళీ పిలిచే అవకాశం ఉంది. ఆయన తన పాస్‌పోర్ట్‌ను పోలీసులకు అప్పగించారు. దేశం దాటి వెళ్లకూడదనే ఆంక్షలు విధించారు.

Melania Fired : రాజయోగానికి దూరం

ఈ అరెస్ట్ తో బ్రిటన్ రాజకుటుంబానికి తీరని అవమానంగా మారింది. కింగ్ చార్లెస్ III తన సోదరుడు ఆండ్రూకు మిగిలిన గౌరవ బిరుదులను కూడా రద్దు చేశారు. “చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో రాజకుటుంబం జోక్యం చేసుకోదు” అని బకింగ్‌హామ్ ప్యాలెస్ స్పష్టమైన ప్రకటన ఇచ్చింది.బ్రిటన్ ప్రజలు ఈ అరెస్టును స్వాగతించారు, ఎవరూ చట్టానికి అతీతులు కారని సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఆండ్రూపై విచారణ తుది దశకు చేరుకుంది. లండన్ పోలీసులు ఎప్‌స్టైన్ ఫైల్స్‌లోని మరిన్ని ఇమెయిల్స్ ,ఫోన్ రికార్డులను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో నేరం రుజువైతే ఆండ్రూకు జైలు శిక్ష తప్పదు. బ్రిటీష్​ న్యాయచట్టం ప్రకారం జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది.

ALSO READ : Us Political Risk : ప్రమాదంలో ట్రంప్​ Andhra Prabha News

Leave a Reply