Megastar | యూట్యూబ్ ని షేక్ చేస్తోన్నవరప్రసాద్

Megastar | యూట్యూబ్ ని షేక్ చేస్తోన్నవరప్రసాద్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : డ్యాన్స్ అంటే.. ఒకప్పుడు ఎ.ఎన్.ఆర్ గుర్తొచ్చేవారు. ఆతర్వాత డ్యాన్స్ అంటే.. మెగాస్టార్ గుర్తొస్తారు. ఆయన తర్వాత ఎంత మంది హీరోలు వచ్చినా.. డ్యాన్స్ అంటే మాత్రం మెగాస్టారే. ఆయన డ్యాన్స్ చేస్తే.. అందులో బ్యూటీ ఉంటుంది.. చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంటుంది. దటీజ్ మెగాస్టార్. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ వస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి హుక్ స్టెప్ వీడియో రిలీజ్ చేశారు.

Megastar

మెగాస్టార్ కు అంత క్రేజ్ రావడానికి డ్యాన్స్ కూడా ఓ కారణం అడంనలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు డ్యాన్స్ అదరగొట్టారు అంటే ఓకే కానీ.. 71 ఏళ్ల వయసులో కూడా డ్యాన్స్ అదరగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆయనకు వయసు పెరుగుతుంది కానీ.. డ్యాన్స్ లో ఆ గ్రేస్.. ఆ బ్యూటీ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు సినినిమా నుంచి రిలీజ్ చేసిన హుడ్ స్టెప్ అయితే.. వేరే లెవల్లో ఉంది. ఈ సాంగ్ ను థియేటర్స్ లో చూస్తే.. అభిమానులకే కాదు.. కామన్ ఆడియన్స్ కి సైతం కుదురుగా కూర్చోలేరు. అంతలా ఆకట్టుకోవడం ఖాయం.

Megastar

CLICK HERE TO READ నవీన్ పోలిశెట్టి అతి చేస్తున్నాడా…?

CLICK HERE TO READ MORE

Leave a Reply