Megastar | ఎందుకనేది స‌స్పెన్స్‌…

Megastar | ఎందుకనేది స‌స్పెన్స్‌…

Megastar | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఇవాళ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన కూతురు సుస్మితతో కలిసి కొండా సురేఖ జూబ్లిహిల్స్ లోని చిరు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన ఇష్టదైవమైన ఆంజనేయస్వామి చిత్రపటాన్ని కొండా సురేఖ అందజేశారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోల‌ను మంత్రి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

అంతే కాకుండా త‌న పోస్ట్ లో చిరంజీవిని మాజీ కేంద్ర‌మంత్రి అంటూ కొండా సురేఖ సంభోదించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవి మాజీ కేంద్ర‌మంత్రి అయిన‌ప్ప‌టికీ చాలా ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఇకపై రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ప్ర‌స‌క్తేలేద‌ని సైతం ఆయ‌న గ‌తంలోనే స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే మంత్రి చిరంజీవిని ఎందుకు క‌లిశారన్న‌దానిపై మాత్రం స్ప‌ష్ట‌త రాలేదు.

అయితే రీసెంట్ గా చిరంజీవి కుమారుడు రామ్ చ‌ర‌ణ్ భార్య క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శుభాకాంక్ష‌లు చెప్పేందుకు వెళ్లారా..? లేక… మ‌రోవైపు సుస్మిత చిరంజీవి అభిమాని అని.. అందుకే ఆయ‌న‌ను క‌లిసేందుకు వెళ్లారా..? అనేది తెలియ‌లేదు.

Leave a Reply