Medical camp | మెగా వైద్య శిబిరం

Medical camp | నాగాయలంక, ఆంధ్రప్రభ : మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నాగాయలంక మండలంలో పర్యటించారు. పర్రచివరలో బొండాడ గ్రూప్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో 900 మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందచేశారు. బొండాడ గ్రూప్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు, బొండాడ ఫౌండేషన్ చైర్మన్ బొండాడ నీలిమ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, రిటైర్డ్ సీఈఓ పాల్గొన్నారు.

Leave a Reply