హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సీబీఐ చేతికి కాళేశ్వ‌రం ప్రాజెక్ట్(Kaleshwaram Project) ఎపిసోడ్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సీబీఐ(CBI) డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సూద్ ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని కోఠి సీబీఐ కార్యాల‌యంలో అధికారుల‌తో భేటీ అయ్యారు.

కాళేశ్వ‌రం క‌మిష‌న్(Commission) నివేదిక‌పై విచార‌ణ నేప‌థ్యంలో సీబీఐ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సూద్(Praveen Sood) ప‌ర్య‌ట‌న‌పై పాధాన్య‌త నెల‌కొంది. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కేసు ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోకి వెళ్లింది.

రాష్ర్టంలో రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసిన ఈ కేసును రాష్ర్ట ప్ర‌భుత్వం సీబీఐకి అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌(Notification)ను రాష్ర్ట హోంశాఖ(Home Ministry) ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్యద‌ర్శి ర‌విగుప్తా ఈ నెల 1న సీబీఐ డైరెక్ట‌ర్‌కు, కేంద్ర హోంశాఖ‌కు పంపారు. ఈ క్ర‌మంలో సీబీఐ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సూద్ హైద‌రాబాద్ రావ‌డం చ‌ర్చాంశ‌నీయంగా మారింది.

Leave a Reply