మెడిటేషన్‌తో ఒత్తడిని జయించొచ్చు!
నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెడిటేషన్ ద్వారా పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్(Sanchit Gangwar) తెలిపారు. ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలోని రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి ఒకరోజు మెడిటేషన్ శిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా గద్దె ఆంజనేయులు శిక్షణ అందించగా, డాక్టర్ కె. జయచంద్ర మోహన్(Dr. K. Jayachandra Mohan) మాట్లాడుతూ ప్రతిరోజూ 10–15 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండి పనులను సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో యూపీహెచ్‌సీ(UPHC) వైద్యులు, కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు.

