Medical tests | మానసిక వికలాంగుల వాహనాన్ని ఢీకొన్న లారీ!

Medical tests | మానసిక వికలాంగుల వాహనాన్ని ఢీకొన్న లారీ!

  • 9మందికి గాయాలు
  • ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే ఆరా

Medical tests | గంగవరం, ఆంధ్రప్రభ : మండలంలోని కీలపల్లె పంచాయతీ పొన్నమాకులపల్లి సమీపంలో బుధవారం రాత్రి బెంగళూరు నుండీ పలమనేరు పట్టణానికి 9మంది మానసిక వికలాంగులతో వస్తున్న ఈ వాహనాన్ని వెనుక వైపు అత్యంత వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో వాహనంలోని 9మందితో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.

పట్టణానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ (సి.ఎస్.ఏ.ట్రస్ట్)లో ఆశ్రయం పొందుతున్న ఈ వికలాంగులను సంస్థకు చెందిన ప్రత్యేక వాహనంలో వైద్యపరీక్షలు(Medical tests) చేయించి, తిరిగి అదే వాహనంలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Medical tests |

అయితే ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. కాగా.. ఇందులో నలుగురు మాత్రం తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు ఇటు వైద్యులు, పోలీసు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.

ప్రమాదంపై ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ఆరా…

బెంగళూరు నుండి వస్తుండగా జరిగిన ప్రమాద ఘటనపై పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సంబంధిత ట్రస్ట్ నిర్వాహకులతో సంప్రదించి ఆరా తీశారు. పలమనేరులోని ఓ ట్రస్ట్ కు సంబంధించిన విభిన్న ప్రతిభావంతులైన పిల్లలను బెంగళూరు(Bangalore)కు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా వీరి వాహనాన్ని వెనుకవైపు నుంచి ట్యాంకర్ డీకొంది. ఈ ప్రమాదంలో పిల్లలతో పాటు అక్కడ సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Medical tests |
Medical tests |

ఈ ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి(MLA Amarnath Reddy) ప్రమాద ఘటనపై అక్కడి నిర్వాహకులు సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమా అని అడిగి తెలుసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డామని సిబ్బంది తెలపడంతో మెరుగైన వైద్యం అవసరమైతే చేయిస్తామని ఆయన వారికి తెలియజేశారు. అటువంటి అవసరం ఏమీ లేదని ట్రస్ట్ సభ్యులు ఆయనకు తెలియజేశారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు.

Leave a Reply