Medical records | 108 అంబులెన్స్ ను ఆకస్మికంగా తనిఖీ…

Medical records | 108 అంబులెన్స్ ను ఆకస్మికంగా తనిఖీ…
Medical records | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి 108 అంబులెన్స్ ను నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ నలుగూరి జనార్దన్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లో ఉన్న మెడికల్ పరికరాలను పరిశీలించారు. అత్యవసర సమయంలో నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.
మెడికల్ రికార్డుల(Medical records)ను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉందాలని, వైద్య సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మందనలు పొందాలని సిబ్బందికి సూచించారు. వాహనాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కేఎంపిఎల్ ను మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటి సాగర్, పైలెట్ రమేష్ ఉన్నారు.
