చందు జ్ఞాపకార్థంగా వైద్య శిబిరం
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గత నెల 23న రుద్రారపు చందు(Rudrarapu Chandu) అకాల మరణం చెందారు. ఆయన జ్ఞాపకార్ధంగా ఉచిత వైద్యశిబిరం ప్రగ్మ హాస్పిటల్, లాలిత్యం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చిన్నకపర్తి గ్రామంలో ఈ రోజు గ్రామ మాజీ సర్పంచ్ బోయపల్లి వాణి శ్రీనివాస్(Boyapalli Vani Srinivas) ప్రారంభించారు.
ఇట్టి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉచిత వైద్యం చేసి, ఉచిత మందులు గ్రామ ప్రజలకు అందచేశారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి ప్రణయ్ కుమార్, కొండ శేఖర్, సిలివేరు పరమేశ్, రుద్రరపు వెంకన్న, ప్రవీణ్, పెద్దలు, సుధాకర్, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు పాల్గొన్నారు.


