ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ఉచిత వైద్యశిబిరం….

ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ఉచిత వైద్యశిబిరం….
ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరం నిర్వహించిందని ఊట్కూర్ ఉప సర్పంచ్ రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ వైద్యాధికారిని సంతోషి అన్నారు. గురువారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక కృషి చేస్తుందనిఅన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పల్లెల్లో పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిందన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు.

ఉచిత వైద్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు చిన్న పిల్లలు జనరల్ ఫిజీషియన్ కంటి దంత ఎముకల వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో 140 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి మందులుపంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వాసు రెడ్డి సంతోష్ రెడ్డి సునీల్ భాను శ్రీ సాత్విక, మల్లిక,వార్డు సభ్యులు గోవిందమ్మ, ఆకాష్, భరత్, అశోక్ గౌడ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
