MEDICAL | ఉచిత కంటి వైద్య శిబిరం

MEDICAL | ఉచిత కంటి వైద్య శిబిరం


సద్వినియోగం చేసుకోండి
MEDICAL |
మక్తల్, ఆంధ్రప్రభ : ఈనెల‌ 9వ తేదీ (రేపు) ఉదయం 9 గంటలకు మక్తల్ లయన్ సేవా భవన్ లో నిర్మహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మక్తల్ పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా అధ్యక్షులు సత్య ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు.

డిస్టిక్ విజన్ చైర్మన్ అనుగొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేయబడిందని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో అర్హులైన వారికి రామ్ రెడ్డి లైన్స్ కంటి దవాఖాన ఏనుగొండ మహబూబ్ నగర్ కు తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించబడుతుందన్నారు. ఉచిత కంటి పరీక్షకు వచ్చేవారి వయస్సు 50 సంవత్సరాలు పైబడి ఉండాలన్నారు.

వచ్చే ముందు రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు మూడింటి జిరాక్స్ ప్రతి తమ వెంబడి తీసుకురావలసిందిగా తెలియజేశారు. చూపు లేని వారికి చూపు అందించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సత్య ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. వివరాల కోసం 9440744334, 9440297998, లయన్స్ క్లబ్ కార్యదర్శి కె. అంజన్, ప్రసాద్ కార్యదర్శి 9985170117. కోషాధికారి ఆడెం సత్యనారాయణ కో 9440752926 నెంబర్లను సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.

Leave a Reply