వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు

వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు

భవానిపురం, ఆంధ్రప్రభ : మేము ఏ ప్రలోభాలకి లొంగలేదని,వైసీపీలో కొంతమంది వ్యక్తుల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని, సక్రమంగా బాధ్యతలు నిర్వహించిన మాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ మారని పార్టీ లేదని, కూటమి కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పశ్చిమ కూటమి కార్పొరేటర్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊసరవెల్లి రాజకీయాలు చేసే మాజీ మంత్రి వెల్లంపల్లి మారని పార్టీ లేదని విమర్శించారు.

వంగవీటి రాధ చేతుల మీదుగా మొదటిసారి బీఫారం అందుకున్నవెల్లంపల్లి దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకున్నారని దుయ్యబట్టారు. వెల్లంపల్లిని ఎమ్మెల్యేగా గెలిపించిన మేము ప్రలోభాలకు లొంగమని అసత్య ప్రచారాలు చేస్తూ,మా డివిజన్లో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించే వారని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, మాజీ మంత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే అయ్యాడు తరువాత ఎం చేయాలో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. దేవాదాయ మంత్రి గా ఉన్నప్పుడు తిరుపతి లెటర్స్ ఇవ్వడానికి కూడ ఎన్నో ఇబ్బందులు పెట్టే వారిని ఆవేదన వ్యక్తపరిచారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి 175 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ ని బెస్ట్ గా చేసి చూపించారని కొనియాడారు. కార్పొరేటర్లుగా పదవి కాలం ముగిసిందని, మా బాధ్యతలు సక్రమంగా నిర్వహించామని, ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీ రావు, మరుపిల్ల రాజేష్, మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురి, గుడివాడ నరేంద్ర రాఘవ, బొల్ల విజయ్ కుమార్ అత్తలూరి ఆదిలక్ష్మి, ఉమ్మడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Reply