Medaram Fair | మహాజాతరలో సింగరేణి రెస్క్యూ సేవలు…

Medaram Fair | తాడ్వాయి, మేడారం, ఆంధ్రప్రభ : మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ దర్శనార్థం రోజూ లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఈనేపధ్యంలో జాతరలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది అద్భుతమైన సేవలు అందిస్తున్నారు.
సుమారు 40మంది సింగరేణి రెస్క్యూ సిబ్బంది మూడు గ్రూపులుగా విడిపోయి గద్దెల ప్రాంగణంలో భక్తులు విసిరిన కొబ్బరి చిప్పలు, బెల్లం ఉండలు తగిలి గాయాలపాలైన వారిని గద్దెల ప్రాంగణంలో అనారోగ్యంతో అస్వస్థతకు గురైన భక్తులకు సహాయక చర్యలు అందిస్తూ వారిని ఆసుపత్రికి అంబులెన్స్ వద్దకు చేరుస్తున్నారు. ఈ సహాయక చర్యలు వలన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి రెస్క్యూ సిబ్బంది ప్రతి మేడారం జాతరకు సేవలు అందించడం అనవాయితీగా వస్తుందని రెస్క్యూ సిబ్బంది వారు తెలిపారు.
