Medak | రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి…

Medak | రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి…
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, మిరుదొడ్డి (ఆంధ్రప్రభ): సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారు ప్రాంతంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు ప్రణతి (24) మృతి చెందగా, ఆమె భర్త లోకా సాయికిరణ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.
ఇటీవలే ఈ దంపతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కానీ దురదృష్టవశాత్తూ జరిగిన ఈ ప్రమాదం వారిని విడదీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉద్యోగం నిమిత్తం సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వైపు టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ప్రణతి, సాయికిరణ్ లను.. పెద్ద చెప్యాల వద్ద వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది.

Medak | గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగానే
దీంతో ఇద్దరూ గాయాలపాలయ్యారు. వెంటనే అంబులెన్స్ ద్వారా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా ప్రణతి మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. సాయికిరణ్‌కు చికిత్స కొనసాగుతోంది. నూతన దంపతులు పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో నివసిస్తున్నట్లు తెలిసింది. ఘటనపై సాయికిరణ్ తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు మిరుదొడ్డి ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
