ప్రమాదాల నివారణకు చర్యలు

ప్రమాదాల నివారణకు చర్యలు
పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ నరసింహ సూచనలు
తిరుమలగిరి నవంబర్ 4 ఆంధ్రప్రభ) : సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ నరసింహ సూచనలు చేశారు. మంగళవారం మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో, మండలంలోని తొండ వెలిశాల గ్రామాలలో నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులు వేగవంతంగా చేయాలని కోరారు.
సూర్యాపేట జనగాం తొర్రూర్ మోత్కూర్ రోడ్లలో వంద ఫీట్ల వరకు ఎలాంటి తోపుడు బండ్లు వాహనాలు పెట్టవద్దని ఆదేశించారు. షాప్ యజమానులు ముందు అద్దెలకిచ్చి ఇతర షాపులు నడిపించే విధంగా ఉన్నవారిపై కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రాణాలు చాలా విలువైనవి. ప్రమాదాలు జరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని మున్సిపాలిటీ మండల రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగారం సీఐ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు ఉన్నారు.
