MB Church | అందరూ కలిసి మెలిసి ఉండాలి

MB Church | అందరూ కలిసి మెలిసి ఉండాలి
- ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
- ఎంబి చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ పండుగ
- వాక్యోపదేశం చేసిన రెవరెండ్ మోజస్
- ప్రత్యేక పాటలతో అలరించిన, యవనస్తులు, మహిళలు
- కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
MB Church | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : అందరూ కలిసి మెలిసి వుండాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఎంబి చర్చిలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎంబి చర్చ్ లో ప్రత్యేక పాటలతో, క్రిస్టమస్ సందేశంతో ఘనంగా క్రిస్మస్ పండుగను నిర్వహించుకున్నారు. క్రిస్టమస్ వాక్యోపదేశాన్ని అందించడానికి కర్నూలు ప్రాంతం నుండి రెవరెండ్ మోజస్ హాజరయ్యారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభువైన ఏసుక్రీస్తు వారి పుట్టుక చరిత్రను సృష్టించిందని, ఈ విశ్వాన్ని కదిలించిందని, దేవుడు ఆత్మ స్వరూపి అని, దేవుడు శరీరధారి అని, ప్రభువైన ఏసుక్రీస్తు వారు దేవాది దేవునికి, మానవాళికి మధ్యవర్తి అని అన్నారు. దేవుడు ఆత్మ స్వరూపి, త్రియేక దేవుడు, అద్వితీయుడన్నారు. దేవుని జననం మానవజాతికి గర్వకారణమైన జననం, శాశ్వత ఉనికి గల జననం, దైవిక జననమన్నారు.
అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ క్రైస్తవులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. అదేవిధంగా దేవుని కృప వచ్చే క్రిస్టమస్ పండుగ వరకు అందరిపై ఉండాలని, దేవుడు అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం క్రిస్టమస్ కేక్ కట్ చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సంపత్ కుమార్, సెక్రటరీ విజయకుమార్, కార్యవర్గ సభ్యులు, నాగర్ కర్నూల్ డి ఎస్ పి శ్రీనివాస్, క్రైస్తవులు సుమారు 500మంది పాల్గొన్నారు.
