Real Estate | ఆఫీస్ లో భారీ చోరీ

Real Estate | ఆఫీస్ లో భారీ చోరీ
Real Estate | నాగోల్, ఆంధ్రప్రభ : ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం.. ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయం తలుపులు పగలగొట్టి పెద్ద మొత్తంలో నగదు, బంగారం దోచుకున్న ఘటన చోటుచేసుకుంది.
సీఐ వినోద్ కుమార్ కథనం ప్రకారం… సాయి దత్తా హస్తినాపురం, ఓంకార్ నగర్ లోని మీలా ప్లాజా 2వ అంతస్తులో రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ రాత్రి 11 గంటలకు రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఈ నెల 13వ తేదీన తిరుపతికి బయలుదేరారు.
ఈ నెల 14న, ఆఫీసు సెక్యూరిటీ గార్డు పి. అంజయ్య రియల్ ఎస్టేట్ ఆఫీసు యజమాని రవీందర్ గుప్తాకు ఫోన్ చేసి, కొంతమంది దుండగులు ఆఫీసు తలుపులు పగలగొట్టి ఆఫీసులోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని చెప్పాడు.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కార్యాలయాన్ని పరిశీలించగా లోపల అల్మారాలు పగలగొట్టి రూ.9 లక్షల నగదు, 10 తులాల బంగారు బిస్కెట్లు పోయినట్లు గుర్తించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎల్బీనగర్ ఏసిపి కృష్ణయ్య గౌడ్ సిఐ వినోద్ కుమార్ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి Click Here కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్
