19 మంది దుర్మరణం
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికాలోని టెన్నెస్సీ (Tennessee) లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న ఓ యుద్ధ సామాగ్రి తయారీ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 19 మంది దుర్మరణం పాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7 45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన అనంతరం 19 మంది అచూకీ లభ్యం కాలేదు.
వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. పేలుడు (Blast) ధాటికి ఒక్కసారిగా సమీపంలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. వాటికి మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమీపంలోని ఇళ్లు, పార్క్ చేసి ఉన్న వాహనాలు ఒక్కసారిగా కంపించాయి. సమీపంలోని సీసీ కెమెరాల్లో పేలుడు దృశ్యాలు నిక్షిప్తం అయ్యాయి. పేలుడుకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని హంప్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ పేర్కొన్నారు.