Breaking| ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్… 8మంది మావోయిస్టుల హతం
ఛత్తీస్ ఘడ్ లో నేడు జరిగిన ఎన్ కౌంటర్ లో 8మంది మావోయిస్టులు మరణించారు. గంగులూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు తారసపడడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 8మంది నక్సలైట్లు మృతిచెందగా, మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నక్సల్స్ కు, పోలీసులకు మధ్య ఎదురెదురు కాల్పులు కొనసాగుతున్నాయి..