ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ !

గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) భారీ అంచనాలు రేపుతోంది.

శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రాశీ ఖన్నా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కొత్త సంవత్సరంలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న మేకర్స్ ఓ ప్రత్యేక సర్ప్రైజ్ ప్రకటించారు. అభిమానులకు “ఫుల్ మీల్స్ రెడీ” అంటూ, రేసు సాయంత్రం 4:30 గంటలకు మాస్ అప్డేట్ రివీల్ చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పటికే హల్‌చల్ చేస్తోంది.

Leave a Reply