Marriguda | మర్రిగూడలో దారుణం..

Marriguda | మర్రిగూడలో దారుణం..
- వృద్ధురాలిపై యువకుడి లైంగిక దాడి
- మద్యం మత్తులో దాడి చేసిన యువకుడు
- గ్రామస్తుల సమాచారంతో నిందితుడి అరెస్ట్
- బాధితురాలికి వైద్య పరీక్షలు
- మండల వ్యాప్తంగా ఆగ్రహం
- నిందితుడిపై కఠిన చర్యలకు డిమాండ్
- పూర్తిస్థాయి విచారణకు ప్రజల విజ్ఞప్తి
Marriguda | మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై 23 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె కుమారులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎదురింటి యువకుడు మద్యం మత్తులో ఇంట్లోకి వెళ్లి దాడికి పాల్పడ్డాడని సమాచారం.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మర్రిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై మండల వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
