Marriage | సావిత్రి నుంచి సమంత వరకు..

Marriage | సావిత్రి నుంచి సమంత వరకు..
Marriage | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పెళ్లి.. ఇద్దరు మనసులు.. మూడు ముళ్లుతో ఒక్కట అవ్వడం. అయితే.. పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది కానీ.. అతి కొద్ది మంది మాత్రం జీవితంలో రెండు సార్లు చేసుకుంటుంటారు. ఇండస్ట్రీలో హీరోయిన్స్ (Heroines) రెండో పెళ్ళి చేసుకున్న వారు ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది కథానాయికలు రెండో పెళ్లి చేసుకున్నారు. అలాగే ఒకే పెళ్లి చేసుకున్నా.. పెళ్లైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కూడా అరుదుగా జరుగుతుంటుంది. ఇండస్ట్రీలో అలా కూడా జరిగినవి ఉన్నాయి. ఇంతకీ.. ఆల్రెడీ పెళ్లైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న తారలు ఎవరు..? రెండో పెళ్లి చేసుకున్న కథానాయికలు ఎవరు..?
Marriage | అప్పటికి సావిత్రి వయసు
సావిత్రి.. జెమినీ గణేష్ ను పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే.. జెమినీ గణేష్ (Gemini Ganesh) కు ఆల్రెడీ పెళ్లైంది. అయినప్పటికీ సావిత్రి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరికీ అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు. అప్పటికి సావిత్రి వయసు దాదాపు 40 ఏళ్లు ఉంటుంది. ఆమె కావాలనుకుంటే.. మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ.. అలా చేయలేదు. జెమినీ గణేషన్ భార్యగానే బ్రతికింది కానీ.. మరో పెళ్లి చేసుకోలేదు. ఆమె కోమాలో ఉన్నప్పుడు జెమినీ గణేషన్ దగ్గరుండి చూసుకున్నారని.. ఆమెకు సేవలు చేశారని చెబుతారు. కోమాలో ఉన్నప్పుడు జెమినీ గణేషన్ చేసిన సేవలు గురించి తెలియదు.. అయినప్పటికీ ఆయన సావిత్రిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అది.. వాళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమ.

Marriage | కృష్ణ, విజయ నిర్మల..
తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కఫుల్ గా పేరు తెచ్చుకున్నారు కృష్ణ, విజయనిర్మల. ఈ జంట కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. కృష్ణకు (Krishna) పెళ్లై ఐదుగురు పిల్లలు ఉన్నారు. విజయనిర్మలకు కూడా పెళ్లైంది. నరేష్ కూడా పుట్టాడు. అటువంటి పరిస్థితుల్లో విజయనిర్మల.. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు.

Marriage | సహజ నటి జయసుధ..
సహజ నటి అనగానే.. ఠక్కున జయసుధే గుర్తొస్తుంటుంది. జయసుధ ముందుగా కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ (rajendra Prasad) అనే బిజినెస్ మేన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత 1985లో నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నిహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నితిన్ కపూర్ 2017లో మరణించారు. ఆతర్వాత ఆమె మూడో పెళ్ళి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలను ఆమె ప్రతినిధులు ఖండించారు.

Marriage | రాధిక – శరత్ కుమార్..
రాధిక.. తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముందుగా ప్రతాప్ పోతన్ (Pratap Pothan) ను పెళ్ళి చేసుకుంది. అతనితో విడాకులు తీసుకున్న తర్వాత రిచర్డ్ హర్డీని పెళ్లి చేసుకుంది. అయితే.. అతనితో చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉంది. అయితే.. అతని పెట్టే టార్చర్ భరించలేక విడాకులు తీసుకుందని అంటుంటారు. ఆతర్వాత శరత్ కుమార్ ను పెళ్ళి చేసుకుంది. అయితే.. రాధికతో పెళ్లి కంటే ముందు శరత్ కుమార్ కు పెళ్లైంది.

Marriage | అమలా పాల్..
మలయాళ నటి అమలా పాల్ (Amala Paul) .. కూడా రెండో పెళ్లి చేసుకుంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఈ మలయాళ ముద్దుగుమ్మ తమిళ డైరెక్టర్ ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత వీరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే.. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆతర్వాత బిజినెస్ మేన్.. జగత్ దేశాయ్ ని పెళ్లి చేసుకుంది. 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకు ఓ బాబు పుట్టాడు.

Marriage | సిద్దార్ధ్ – హైదరీ..
సిద్ధార్థ్.. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆట తదితర చిత్రాలతో తెలుగులో సక్సెస్ (Success) సాధించాడు. అయితే.. సరైన కథలు ఎంచుకోకపోవడం వలన తెలుగు సినిమాలకు దూరం అయ్యాడు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సిద్ధార్థ్, చిన్ననాటి స్నేహితురాలు మేఘన నారాయణ్ ను 2003లో పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత 2007లో విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత మహా సముద్రం అనే సినిమాలో నటించిన అదితిరావు హైదరీతో స్నేహం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారడంతో 2024లో అదితిరావు హైదరీని సిద్ధార్థ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే.. హైదరీకి ఈ పెళ్లి కంటే ముందు సత్యదీప్ మిశ్రాతో పెళ్లి జరిగింది.

Marriage | సమంత, రాజ్ నిడమోరు..
సమంత.. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ (Tollywood) లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్ కి తగ్గటే అందం, అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. అయితే.. ఈ సినిమా చేస్తున్న టైమ్ లో నాగచైతన్య, సమంత ప్రేమలో పడడం.. ఆతర్వాత పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఆతర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇటీవల ఫ్యామిలీ మేన్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 1న రాజ్, సామ్ ఇద్దరు ఇషా ఫౌండేషన్ లో అమ్మవారి గుడిలో భూత శుద్ది వివాహా పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. మనం ఒకటి అనుకుంటే.. అనుకోనిది ఏదో జరుగుతుంటుంది.. అదే జీవితం.. ఎవరూ కావాలని రెండు పెళ్లిళ్లు.. మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకోరు. అందరూ చేసుకున్నట్టుగా ఒక పెళ్లే చేసుకోవాలి అనుకుంటారు. అయితే.. అందరి జీవితాలు.. అందరి తలరాతలు ఒకలా ఉండవు. ఒక్కొక్కరి జీవితం.. ఒక్కోలా ఉంటుంది. అదే.. జీవితం.

