వేణుగోపాల స్వామి కళ్యాణం

వేణుగోపాల స్వామి కళ్యాణం

గంపలగూడెం, ఆంధ్రప్రభ : ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం రాత్రి 9 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ సహాయ కమిషనర్ నేల సంధ్య తెలిపారు. కల్యాణ ఘట్టం పరాశరం వెంకటరమణాచార్యులు పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు టి.గోపాలచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.

కళ్యాణ పీటలపై కూర్చునేందుకు 230కు పైగా దంపతులు వస్తారనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడించారు. కల్యాణ మహోత్సవానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడంతో పాటు పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా దేవాదాయ శాఖ అధికారిణి టి.అనురాధ లడ్డూ తయారీ కేంద్రం సందర్శించి లడ్డూ నాణ్యతను పరిశీలించారు.

Leave a Reply