సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి తన కుమారుడు మార్క్ శంకర్ అందరి ఆశీస్సులతో కోలుకుంటున్నాడని పవన్ కళ్యాన్ తెలిపారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పవన్ తెలిపారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి ధైర్యం చెప్పారని… అవసరమైన సహాయం అందించాలని సింగపూర్‌లోని హైకమిషనర్‌ను ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారని… మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్టు తెలిపారు. అలాగే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఫోన్ చేసి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి రఘు రామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కె.ఆచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, దుర్గేష్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్, బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర సినీ నటులు, సినిమా రంగ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మార్క్ శంకర్ కోలుకోవాలని ఆకాంక్షించారని.. ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి, ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడని.. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.