March 2 | ఈ – వేలంలో తిరుమల శ్రీవారి వస్త్రాలు

March 2 | ఈ – వేలంలో తిరుమల శ్రీవారి వస్త్రాలు
March 2 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అనుబంధ ఆలయాల్లోని వస్త్రాలను, భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని ఆన్లైన్లో వేలం వేయనుంది. ఈ వేలం మార్చి 2, 2026 నుండి మార్చి 9, 2026 వరకు EA ID Nos 25597 నుంచి 25602, 25604 నుంచి 25609 ద్వారా జరగనుంది. ఆసక్తిగల బిడ్డర్లు AP ప్రభుత్వ ఈ-కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి.
మరోవైపు, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు మహారథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములు) ఏఈవో ( వేలములు), టీటీడీ, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https: // konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్సైట్ www. tirumala.org లేదా 0877-2264429 / 9959988470 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు.
