Maoists | కీలక ప్రకటన

Maoists | కీలక ప్రకటన
Maoists | ఆయుధాలు వీడేందుకు సిద్ధం…
Maoists| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆయుధ విరమణపై మావోయిస్టులు (Maoists) సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ (letter) రాశారు. ఆపరేషన్ కగార్ (Operation Kagar) లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో, సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Maoists | కేంద్ర కమిటీ సభ్యుడు
Maoists | వివరాల ప్రకారం.. ఆయుధాలు వీడే విషయమై మావోయిస్టులు తాజాగా లేఖ (letter) విడుదల చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ (Maharashtra, Madhya Pradesh, Chhattisgarh) రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపించారు. మావోయిస్టు ప్రతినిధి పేరుతో సీఎంలకు (CMs) లేఖ అందింది. ఈ లేఖలో మావోయిస్టులు తాము ఆయుధాలు వీడి, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా, కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా (Sonu Dada) తీసుకున్న ‘పోరాటం నిలిపివేయాలన్న’ నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మావోయిస్టు (Maoists) ప్రతినిధులు ఆయుధాలు విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాస పథకాలను పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..మావోయిస్టు రహిత రాష్ట్రం లక్ష్యం Click Here
To Read More Articles and Latest Updates, Click Here
