అందరు శ్రమించారు..

  • సమన్వయంతో పని చేశారు
  • భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు
  • 5.08 లక్షల మంది హాజరయ్యారు
  • 28 లక్షల లడ్లు విక్రయించాం
  • 26 లక్షల మందికి అన్నప్రసాదాలు
  • హుండీ ఆదాయం రూ.25.12 లక్షలు
  • టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : అధికారుల ప్రక్కా ప్రణాళికతో, అన్ని శాఖల సమన్వయంతో కనీవినీ ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

బ్రహ్మోత్సవాల విజయోత్సవం సందర్భంగా తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, పోలీసు, టీటీడీ విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు సమన్వయంతో పని చేశారని, ఈ బృందాని కృతజ్ఞతలు తెలిపారు.

తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో 5.08 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని, రూ.25.12 లక్షల హుండీ ఆదాయం లభించిందని చైర్మన్ వివరించారు. 26 లక్షల మందికి పైగా అన్నప్రసాదాలు స్వీకరించారని, 2.24 లక్షల మంది తలనీలాలు సమర్పించారని, 28 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయన్నారు.

పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం చక్కటి సమన్వయంతో పని చేసిందని, పోలీసు, విజిలెన్స్ చర్యలతోనే సురక్షితంగా, క్షేమంగా భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని చైర్మన్ కితాబు ఇచ్చారు. సీఎం సూచనలు, బోర్డు నిర్ణయాలు‌‌సాంకేతికత వల్ల రద్దీ క్రమబద్దీకరణను సజావుగా నిర్వహించామని, కొంత సాంకేతిక సమస్య ఏర్పడిందని, అందుకే ఇస్రో , ఎల్ అండ్ టీ సేవలు వినియోగించు కోలేకపోయామన్నారు.

రాబోయే వైకుంఠ ఏకాదశి కు ఇస్రో సేవలు వినియోగించుకుంటామని చైర్మన్ వివరించారు. సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారని, శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వెంకటాద్రి నిలయాన్ని ఉపరాష్ట్రపతి, సీఎం ప్రారంభించిన విషయాన్ని చైర్మన్ గుర్తు చేశారు.

వైకుంఠ క్యూ కాంప్లెక్సు లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటరును ప్రారంభించారని, టీటీడీ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేశారని, సీఎం చంద్రబాబు నుంచి అభినందనలు వచ్చాయని టీడీటీ చైర్మన్ తెలిపారు. హోల్డింగ్ పాయింట్లలో 17 వేల మందికి గరుడ సేవకు వాహన దర్శనం జరిగిందన్నారు.

Leave a Reply