గోల్డెన్ బుల్లెట్ తాజా ఫిల్మ్‌లో మను భాకర్ !

బ్రాండ్ ఫిల్మ్ లింక్:

హైదరాబాద్ : ‘గోల్డెన్ బుల్లెట్’ పవర్ టూల్స్ అందించే ప్రఖ్యాత సంస్థ. ఈ బ్రాండ్ పారిస్ ఒలింపిక్స్ 2024లో డబుల్ కాంస్య పతక విజేత మను భాకర్‌ నటించిన తన తాజా‌ యాడ్ ఫిల్మ్‌ను విడుదల చేసింది. ‘చాంపియన్స్ ఉత్తమ సాధనాలు ఎంచుకుంటారు’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ ప్రచార చిత్రంలో నైపుణ్యంతో పని చేసే భారతీయ ప్రొఫెషనల్స్‌ తమ పనిలో అత్యుత్తమ ఫలితాల కోసం విశ్వసనీయ సాధనాలు ఎంచుకుంటారని తెలియజేస్తుంది.

ఈ ఫిల్మ్‌లో అత్యుత్తమ స్థాయిలో విజయాన్ని సాధించేందుకు అవసరమైన ఏకాగ్రత, కచ్చితత్వం, సంకల్పం వంటి ముఖ్యమైన విషయాలను ప్రధానంగా చూపించారు. ఇవే లక్షణాలు గోల్డెన్ బులెట్‌ను ఉపయోగించే ప్రొఫెషనల్స్‌కి కూడా ఉంటాయి. ఉత్తమ పనిముట్లు ఎన్నుకున్నప్పుడే ప్రదర్శన మెరుగవుతుందని ఎవరైనా అంగీకరిస్తారు.

గోల్డెన్ బుల్లెట్ 1963 నుంచి నాణ్యత, నవీనత విలువలకు ప్రతీకగా నిలుస్తూ.. అనేక రంగాల్లో ప్రొఫెషనల్స్‌కి విశ్వసనీయమైన పవర్ టూల్స్, హ్యాండ్ టూల్స్, ఇతర ఉపకరణాలు అందిస్తోంది. తాజా బ్రాండ్ ఫిల్మ్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిర్మించే నైపుణ్యవంతుల‌కు అంకితంగా రూపొందించారు. ఈ ఫిల్మ్ ఓ స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే, ఉత్తమ సాధనాలు ఎంచుకోవాల్సిందే.

ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ టూల్స్ కార్పొరేషన్‌ భాగస్వాములు కమల్ కంపాణీ, ఆకాష్ కంపాణీ మాట్లాడుతూ మను భాకర్‌తో కలిసి ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను విడుదల చేయడంతో ఎంతో ఆనందంగా ఉన్నామన్నారు. అత్యద్భుత ఆమె ప్రయాణం, ఆయా రంగాల్లో ఛాంపియన్లుగా నిలిచే నిపుణుల ఆత్మను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గోల్డెన్ బులెట్‌లో మేము నమ్మే సూత్రం ఏ పనైనా సరే అత్యుత్తమ టూల్స్ వాడితే పనితీరు మెరుగవుతుందనేదన్నారు. అత్యున్నత నాణ్యత గల టూల్స్‌ను అందించడం ద్వారా ప్రతి ఛాంపియన్‌కు మద్దతు ఇవ్వడమే మా లక్ష్యమన్నారు.

🔗
🌐 కంపెనీ వెబ్‌సైట్:

https://goldenbullet.co.in

Leave a Reply