Mantralayam | రిటైర్డ్ తహసీల్దార్ పెన్షన్ లో ఐదు శాతం కోత

Mantralayam | మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం మండలం కేంద్రంలో ఉన్న సర్వే నంబరు 35/1 విస్తీర్ణం 1.09 సెంట్లు రస్తా పోరంబోకు భూమిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు భూమిలో కొంత మంది వ్యక్తులకు 2022 లో చెల్లని పట్టాలు ఇచ్చినందుకు మంత్రాలయం ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకుడు యేబు ఫిర్యాదు మేరకు రిటైర్డ్ మంత్రాలయం తహసీల్దార్ చంద్రశేఖర్ పెన్షన్ లో ఐదు శాతం కోత విధించినట్లు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన విచారణ చేసి సీసీఎల్ ఏ అధికారులు నివేదిక అందజేశారు.
వారు విజిలెన్స్ కమిటీ కు విచారణ చెయ్యాలని ఆదేశించగా ,ఈ విచారణ లో ప్రైవేటు భూమిలో అక్రమంగా ఎటువంటి ఆర్ సి నంబరు లేకుండా పట్టాలు ఇచ్చినట్లు ధృవీకరించి నివేదికను ప్రభుత్వానికి అందచేశారు. ప్రభుత్వం ఆయనకు వచ్చే పెన్షన్ లో ఐదు శాతం కోత విధించినట్లు తెలిసింది. ఈ విషయం పై త్వరలో హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయమైన సమాచారం..అంతేకాకుండా మండల పరిధిలోని సౌలహళ్లి గ్రామానికి చెందిన హరిజన ముత్తమ్మ కు చెందిన వ్యవసాయ భూమి విషయం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు దిక్కరించినందుకు హైకోర్టులో కోర్టు విచారణ ధిక్కారణా కేసు ఆయన పై కేసు విచారణలో ఉందని తెలిసింది.
