Manthan | ఆశీర్వదించి అండగా నిలవండి..
గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
మంథన్ గోడ్ సర్పంచ్ అభ్యర్థి నరెందర్ రెడ్డి
Manthan | మక్తల్, ఆంధ్రప్రభ : ఆశీర్వదించి అండగా నిలవండి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని మంథన్ గోడ్ సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని మంథన్ గోడ్ గ్రామపంచాయతీలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. స్థానికంగా అధికారం చెలాయించిన నాయకులు గ్రామ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేసిన నాయకులకు ఈ ఎన్నికల్లో చెంప చెల్లుమనిపించేలా తనను భారీ మెజారిటీతో సర్పంచిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామానికి సేవ చేయాలన్న తలంపుతో సర్పంచిగా బరిలో ఉన్నానని, మరోసారి మోసపోకుండా తనను సర్పంచిగా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రాములు, ప్రతాపరెడ్డి, దర్శన్ గౌడ్,శంకర్, ఆశన్న, పాండు, మల్లికార్జున్, బ్రహ్మయ్య, చంద్రయ్య, రాములు గౌడ్, రమేష్ ,శాంతప్ప తదితరులు పాల్గొన్నారు.

