Manohar Reddy | సీపీఎం నుండి బీజేపీలో చేరిక

Manohar Reddy | సీపీఎం నుండి బీజేపీలో చేరిక

Manohar Reddy | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరుతున్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూరు గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు గడ్డం రాము తన అనుచరులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

ఈసందర్భంగా వారికి మనోహర్ రెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షాగ చంద్రశేఖర్ రెడ్డి, చౌటుప్పల్ మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్, సీనియర్ నాయకులు ఉడుగు యాదయ్య, బూత్ ప్రెసిడెంట్ కొండూరు వికాస్, నాయకులు స్వామి గౌడ్, కనకాచారి, సైదులు, సందీప్, శివ కుమార్, సృజన్, రామకృష్ణ, ప్రకాష్, మధు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply