Manipur | సీఎం బీరేన్ సింగ్ రాజీనామా..

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. ఈరోజు (ఆదివారం) రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో రాష్ట్ర గవర్నర్‌తో సమావేశమైన తర్వాత తన రాజీనామాను సమర్పించారు.

మణిపూర్ లో కొంత‌కాలంగా జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. ముఖ్మ‌మంత్రిగా బీరేన్ సింగ్ పనితీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అమిత్ షాతో భేటీ అయిన బీరేన్ సింగ్.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

Leave a Reply