Manifesto | మోకాళ్ళతో నిరసన…

Manifesto | మోకాళ్ళతో నిరసన…
- అసెంబ్లీని ముట్టడిస్తాం పోరాటమే శరణ్యం…
- రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు..
Manifesto | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి కూటమి గెలుపునకు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్నారు. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కావటం లేదని ఆర్థిక సమస్యలతో ఉపాధ్యాయులు లాడిపోతున్నారని కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన దశాలవారి పోరాటంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు ఎస్.చంద్ర శేఖర్, ప్రధానా కార్యదర్శి యం. అజాం బేగ్ ల ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర నాయకులు శివ శంకర్, గిరిబొయిన నాగేంద్ర కుమార్, ఈవీ గోపాలకృష్ణ మౌలాలి, ప్రసాదరెడ్డి అమీర్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సమస్యల పరిష్కారం కోసం మోకాళ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయిలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 12వ వేతన సవరణ కమీషన్ నియమిస్తామని, మధ్యంతర భృతి చెల్లిస్తామని, కాంట్రీ బ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన విధాన్నని రూపొందిస్తామని, 34 వెల కోట్ల రూపాయలు అరియర్స్ బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ తయారు చేస్తామని, క్రమం తప్పకుండా కేంద్రంతో పాటు కరువు భత్యాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరలేదని వాపోయారు.

ఎన్నికల ముందు ఉద్యోగులను ఉపాధ్యాయులను నమ్మబలికి తీయని మాటలు చెప్పి గద్దె ఎక్కిన తరువాత ఉద్యోగులు గుర్తుచేస్తూ ప్రాతినిధ్యాలు చేస్తే ప్రభుత్వం పెడచెవ్విన పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. హెల్త్ స్కీం కొరకు ఉద్యోగుల నెల జీతాలనుండి మినహాయింపులు చేస్తున్న ఈహెచ్ఎస్ విధానంలో ఎలాంటి పురోగతి లేదన్నారు.మెడికల్ రీయింబర్స్ మెంటు గరిష్ట పరిమితి 2 లక్షలు దాటాక పోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా అప్పుల పాలు అవుచున్నారని విమర్శించారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులు మరణించి కారుణ్య నియామకాలు లేక అల్లాడుతుంటే ప్రభుత్వాలకు చీమకుట్టినట్లుగా లేకపోవడం దారుణమన్నారు.
ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయ సమ్మతమైన డిమాండ్ల పరిస్కారానికి ప్రత్యేక చొరవ చూపకపోతే ఈనెల 25న అసెంబ్లీని ముట్టడిస్తామని, అవసరం అయితే మొరొక భారీ తరహా ఉద్యమానికి వెనకాడమని హెచ్చరించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ కు వినతి పత్రాన్నిఅందజేశారు. ఈ కార్యకరంలో మాజీ జిల్లా అధ్యక్షుడు డి.మౌలాలి టి.నూరుల్లా జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్ ఎస్.అమీర్, జి.నాగేంద్రకుమార్,వై.ప్రసాద్,పి.శ్రీనివాస రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
