Mandir | ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు…

Mandir | ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు…
Mandir | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఈ రోజు మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కాచాపూర్ గ్రామంలో గల మార్కండేయ మందిరం(Mandir)లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు నిర్వహించారు. మార్కండేయ చిత్రపటానికి పద్మశాలి సంఘం సభ్యులు మహిళలు(women) ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో గల పద్మశాలి సంఘ భవనంలో మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.

మండలంలోని రామేశ్వర పల్లి గ్రామంలో గల మార్కండేయ మందిరంలో ఆయన జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మార్కండేయ స్వామి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని ఈ సందర్భంగా భక్తులు ఆకాంక్షించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
