మంచిర్యాల .. ఆంధ్రప్రభ – నకిలీ పత్తి విత్తనాల రవాణాపై మంచిర్యాల టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. శుక్రవారం రైలులో తీసుకు వస్తున్న 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని రవాణా చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి మంచిర్యాలకు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఖరీఫ్ సీజన్ కు ముందే నకిలీ విత్తనాలను తీసుకువచ్చి వ్యాపారులు స్టాక్ పెట్టుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.. ఆ వ్యాపారులను పట్టుకునే పనిలోలో టాస్క్ ఫోర్స్ పనిలో ఉన్నారు… ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్సై ఉపేందర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Mancherial | 100 కిలోల నకిలీ సీడ్స్ సీజ్
